Miryalaguda: మిర్యాలగూడలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి, బిఎల్ఏల కృతజ్ఞత సభ!
Miryalaguda: మిర్యాలగూడలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలతో పాటు బీఎల్ఏల కృతజ్ఞత సభను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Miryalaguda: మిర్యాలగూడలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి, బిఎల్ఏల కృతజ్ఞత సభ!
మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్ విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బి ఎల్ ఏ లతో కలసి కృతజ్ఞత సభను నిర్వహించారు భారత రత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కృతజ్ఞత సభకు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలని చూస్తే సహించబోన న్నారు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు పార్టీని తనని విమర్శించే వారికి తానేంటో చూపిస్తానని సవాల్ చేశారు.
ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాల కాలంలో తాను ఎంతో నేర్చుకున్నానని ఎవరు ఏంటో తనకు అర్థమవుతుందని చెప్పారు పట్టణంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం మరియు దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానన్నారు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాను అని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన పార్టీ గెలుపు కోసం పని చేస్తానన్నారు డిసెంబర్ 9న పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని అతిధులతో కలిసి కేక్ కట్ చేశారు.




