Nalgonda: పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణ లక్ష్మి!
Nalgonda: నకిరేకల్ పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
Nalgonda: పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణ లక్ష్మి!
Nalgonda: నకిరేకల్"కల్యాణ లక్ష్మి – పేదలకు వరం" 16 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందని అన్నారు.
ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఎంతో తోడ్పాటును అందిస్తోందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Next Story




