Suryapet: సూర్యాపేట క్యాంపు ఆఫీసులో సందడి లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు

Suryapet: సూర్యాపేటలో 75 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అందజేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Updated on: 13 May 2026 12:55 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట క్యాంపు ఆఫీసులో సందడి లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, వారికి భరోసా కల్పించారు.

ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో గాయపడినవారు, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన 75 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేసినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story