Munugode: సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Munugode: ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల నిబంధనలపై సొంత ప్రభుత్వంపైనే అసహనం వ్యక్తం చేసిన మునుగోడు ఎమ్మెల్యే.

Saleem, Nalgonda
Published on: 13 Aug 2026 10:41 PM IST
Munugode
X

Munugode: సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

​మునుగోడు: సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రులు, ఎగువ స్థాయిలో ఉన్నవారు వేల కోట్లు దోచుకోవడానికి ఎలాంటి నిబంధనలు అడ్డురావు కానీ, నిరుపేదలకు ఇచ్చే రూ.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం మాత్రం వందలాది నిబంధనలు పెడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

​"పైన ఉన్నోడు లక్షల కోట్లు దోచుకుంటున్నాడు.. మంత్రులు దోచుకోవడానికి ఏ రూల్స్ ఉండవు. కానీ పేదవాడికి రూ.5 లక్షల ఇందిరమ్మ బిల్లు ఇవ్వడానికి మాత్రం 500 రూల్స్ పెడతారు. ప్రజలను మోసం చేయడమేనా? ఇదెక్కడి న్యాయమండి?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story