Nalgonda: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
Nalgonda: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.
Nalgonda: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
Nalgonda: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి ప్రాణాలు కాపాడేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు.
నారాయణపురం మండలం కోపుల తండాకు చెందిన మెగావత్ రాకేష్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో, స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే, తక్షణమే స్పందించి 2 లక్షల రూపాయల అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించారు.
హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లిన నారాయణపురం మండల నాయకులు, రాకేష్ తల్లిదండ్రులకు ఆ 2 లక్షల రూపాయల చెక్కును నేరుగా అందజేశారు. సమయానికి స్పందించి ప్రాణదాతగా నిలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి బాధితుడి కుటుంబ సభ్యులు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు.




