PA Pally: రూ.75 లక్షలతో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ భవనం.. శంకుస్థాపన!
PA Pally: గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన వసతి గృహ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ గారు శంకుస్థాపన చేశారు.
PA Pally: రూ.75 లక్షలతో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ భవనం.. శంకుస్థాపన!
పీఏ పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన వసతి గృహ భవన నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




