Nakirekal: నకిరేకల్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ!

Nakirekal: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 8 వేల మందికి పైగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను వివరించిన విప్ వేముల వీరేశం.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 16 July 2026 2:25 PM IST
Nakirekal
X

Nakirekal: నకిరేకల్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ!

Nakirekal: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 01, 07, 08, 09, 10, 11 వార్డులకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో 8 వేలకుపైగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలుచేసిందని విమర్శించారు.

నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి, అందులో ట్రామా కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కడపర్తి గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.

నకిరేకల్ పట్టణంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story