Nalgonda: ఎమ్మెల్యే వీరేశం సింప్లిసిటీ.. రైతులతో కలిసి బురదలోకి!
Nalgonda: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం నల్లగొండలోని తన వ్యవసాయ క్షేత్రంలో రైతులతో కలిసి వరి నారుమడి పనుల్లో పాల్గొన్నారు
Nalgonda: ఎమ్మెల్యే వీరేశం సింప్లిసిటీ.. రైతులతో కలిసి బురదలోకి!
నల్గొండ: ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మరువకూడదన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం. పదవి, హోదాను పక్కన పెట్టి, చేతికి మట్టి అంటించుకుని తన వ్యవసాయ క్షేత్రంలో వరి నారుమడి పనుల్లో నిమగ్నమయ్యారు.
వ్యవసాయంపై తనకున్న మక్కువను మరోసారి చాటుకున్న వీరేశం, స్వయంగా గోనె సంచిని భుజాన వేసుకుని నారుమడిలో వరి మొలకలను చల్లారు. "మనం తినే తిండి మనమే పండించుకోవాలి" అని చెబుతూ, బురదలో దిగి రైతులతో కలిసి ఆయన పనిచేయడం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా తోటి రైతులతో భేటీ అయిన ఎమ్మెల్యే, ప్రస్తుత సాగు పరిస్థితులు, పంటలకు ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు.
రైతులు సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారికి పూర్తిస్థాయిలో భరోసా కల్పించారు. నాయకుడు అంటే అధికారం చెలాయించేవాడు మాత్రమే కాదు, రైతన్న కష్టసుఖాల్లో భాగస్వామి కావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం తన చర్యలతో నిరూపించారు.
రాజకీయాలకు అతీతంగా, కర్షకుడి కష్టాన్ని గౌరవించే ఆయన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి




