Nakrekal: వృద్ధులకు స్వయంగా టిఫిన్ వడ్డించిన నకిరేకల్ ఎమ్మెల్యే!
Nakrekal: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన నివాసానికి వచ్చిన వయోవృద్ధుల పట్ల చూపిన మానవత్వం, ఆత్మీయత స్థానికంగా చర్చనీయాంశమైంది.
Nakrekal: వృద్ధులకు స్వయంగా టిఫిన్ వడ్డించిన నకిరేకల్ ఎమ్మెల్యే!
నకిరేకల్: ప్రజాప్రతినిధి అంటే కేవలం అధికార హోదా మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఆత్మీయుడని నిరూపించారు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తన నివాసానికి వచ్చిన వయోవృద్ధుల పట్ల ఆయన చూపిన మానవత్వం, ఆత్మీయత స్థానికంగా చర్చనీయాంశమైంది.
స్వయంగా అల్పాహారం వడ్డించి..
గురువారం ఉదయం వెలిమినేడు గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. వారిని చూడగానే వీరేశం ఆప్యాయంగా పలకరించారు. ఉదయమే రావడంతో "టిఫిన్ చేశారా?" అని ఆరా తీశారు. వారు ఇంకా తినలేదని తెలపడంతో, ఏమాత్రం సంకోచించకుండా వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. తానే స్వయంగా వారికి అల్పాహారం వడ్డించి, ఆకలి తీర్చడమే కాకుండా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Next Story




