Chityala: ఉరుమోడ్ల, పిట్టంపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ
Chityala: చిట్యాల మండలం ఉరుమోడ్ల, పిట్టంపెల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేముల వీరేశం, గుత్తా అమిత్ ప్రారంభించారు.
Chityala: ఉరుమోడ్ల, పిట్టంపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ
చిట్యాల: చిట్యాల మండలం, ఉరుమోడ్ల, పిట్టంపెల్లి గ్రామాల్లో PACSఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయ డైరీ చైర్మన్ గుత్త అమిత్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




