Mothkur: మోత్కూరు పరిధిలో డాక్టర్ బుర్రపాడు వైఖరి ఆశా వర్కర్ల ఫిర్యాదు!
Mothkur: గుండాల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ వస్త్రధారణపై అసభ్య కామెంట్లు చేస్తున్నారంటూ 30 మంది ఆశా కార్యకర్తలు డీఎంహెచ్‌వో, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఫిర్యాదు.
Mothkur: మోత్కూరు పరిధిలో డాక్టర్ బుర్రపాడు వైఖరి ఆశా వర్కర్ల ఫిర్యాదు!
Mothkur: ప్రజలకు వైద్యం చేయాల్సిన ఓ డాక్టర్ బుర్ర పాడు ఆలోచనలతో నిండిపోయి రోగిష్టి డాక్టర్ లా తయారయ్యాడు. ఆస్పత్రిలో పనిచేస్తున్న తోటి మహిళా వైద్య సిబ్బంది వస్త్రధారణ పై తప్పుడు కామెంట్లు చేస్తూ వారిని వేధిస్తున్నాడన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వైద్యాధికారి వేధింపులు భరించలేని మహిళా సిబ్బంది జిల్లా డీఎంహెచ్వో కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లా గుండాల మండలం వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గత కొంత కాలంగా తమ కట్టు బొట్లపై వల్గర్ గా కామెంట్లు చేస్తున్నాడని 30 మంది ఆశా కార్యకర్తలు యాదాద్రి డిఎంహెచ్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఫిర్యాదు చేశారు.
తమ భర్తలు బైకుల మీద వచ్చి దించేసి వెళ్తే మీ మొగుళ్ళు ఎందుకు వస్తున్నారని, మేము కట్టుకునే చీరలు, జాకెట్లపై అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. తాము చేయాల్సిన విధుల గురించి అడగకుండా తాము కట్టుకునే చీరలు, జాకెట్ల గురించి, తమ వ్యక్తిగత విషయాలపై డాక్టర్ ఎలా మాట్లాడుతాడని ప్రశ్నిస్తున్నారు.
ఓ ఆశా కార్యకర్త మామయ్య చనిపోతే కనీసం సెలవు కూడా ఇవ్వలేదని, వాష్ రూమ్ కి వెళితే రిజిస్టర్ లో రాసి వెళ్ళమంటాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వచ్చేదే కొద్దిపాటి వేతనమైనా గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని, కానీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తాము కట్టుకునే చీరలు, బ్లౌజులపై కామెంట్లు చేస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా ఏ డాక్టర్ ఈ విధంగా ప్రవర్తించలేదని ఆరోపిస్తున్నారు.
కాగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గతంలో పనిచేసిన అడ్డగూడూరులో కూడా ఓ మహిళా ఉద్యోగిని సెక్సువల్ గా అరాస్ మెంట్ చేస్తున్నాడన్న ఆరోపణలపై జిల్లా అధికారులు ఆయన్ను అక్కడి నుంచి డిప్యూటేషన్ పై గుండాలకు పంపించారు. 8 నెలల క్రితం గుండాల కు వచ్చిన డాక్టర్ ప్రవీణ్ తన తీరు మార్చుకోకుండా అదే విధంగా మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతుండటంతో మండలంలో హాట్ టాపిక్ గా మారింది. విషయం డీఎంహెచ్ వో వద్దకు చేరడంతో ఆయన మహిళా ఉద్యోగులకు తగిన చర్యలు తీసుకోవడానికి సోమవారం వరకు సమయం ఇవ్వాలని చెప్పినట్టు తెలిసింది. డాక్టర్ పై చర్యలు తీసుకొని పక్షంలో ఆస్పత్రి ఎదుట నిరవధిక నిరాహారదీక్షకు దిగుతామని మహిళా వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు.




