Nakrekal: నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
Nakrekal: నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం పరిశీలించారు.
Nakrekal: నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి పరిశీలించారు.కేంద్రంలో ధాన్యం సేకరణ, తూకం విధానం, రవాణా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన వారు.. స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఐపీసీ కేంద్రాల్లో తాగునీరు, నీడ, తార్పాలిన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని, దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు భారీగా పాల్గొన్నారు.




