Suryapet: మఠంపల్లిలో అంగన్వాడి విద్యార్థులకు పలకలు, చార్ట్స్ పంపిణీ!
Suryapet: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో అంగన్వాడి విద్యార్థులకు పలకలు, చార్టులు పంపిణీ చేసిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కాంపాటి సందీప్.
Suryapet: మఠంపల్లిలో అంగన్వాడి విద్యార్థులకు పలకలు, చార్ట్స్ పంపిణీ!
Suryapet: మండలంలోని 5వ సెక్టార్ అంగన్వాడి కేంద్రంలో మఠంపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కాంపాటి సందీప్ మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలకలు, చార్ట్స్ మరియు ఆట వస్తువులను ఘనంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కాంపాటి సందీప్ మాట్లాడుతూ... అంగన్వాడి కేంద్రాల ద్వారానే పిల్లలు మొట్టమొదటిగా పలక, బలపంతో అక్షరాభ్యాసంతో అ ఆ లు, ఏ బి సి డి లను నేర్చుకుంటారని తెలిపారు.
గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తి, కృషితోనే ఎస్సీ వర్గీకరణ (ఏబిసిడి) సాధించుకోవడం జరిగిందని, నేడు ఆ వర్గీకరణ ఫలాలు అట్టడుగు వర్గాలకూ అందుతున్నాయని పేర్కొన్నారు. దీనికి పూర్తిగా మందకృష్ణ మాదిగ త్యాగమే కారణమని, కాబట్టి ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించి, వర్గీకరణ ఫలాలను అందుకోవాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థులకు మఠంపల్లి మండల ఎమ్మార్పీఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, విద్యను ప్రోత్సహించడంలో ముందుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కాటేపల్లి మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్, నందిపాటి సోమయ్య , బాలు నాయక్, సురేష్, ఆరాల సైదులు, అంగన్వాడి టీచర్ రావులమ్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.




