Nalgonda: నల్గొండ మున్సిపాలిటీలో ఏఐ 'వాట్సప్ చాట్‌బాట్' సేవలు!
Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిర్యాదుల కోసం ఏఐ ఆధారిత 'వాట్సప్ చాట్‌బాట్' సేవలు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నూతన సాంకేతికత అందుబాటులోకి.
Nalgonda: నల్గొండ మున్సిపాలిటీలో ఏఐ 'వాట్సప్ చాట్‌బాట్' సేవలు!
Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత 'వాట్సప్ చాట్‌బాట్' అందుబాటులోకి రానుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సాంకేతికత ద్వారా కార్యాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే ఫిర్యాదులు చేయవచ్చు.
నగరంలోని 48 డివిజన్ల పరిధిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాల సమస్యలను ఫొటో, లొకేషన్‌తో సహా వాట్సప్‌లో పంపితే సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరిస్తారు.




