Ghattuppal: బీజేపీ నేతపై దాడి.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన కాషాయ శ్రేణులు!
Ghattuppal: అంతపేటలో బీజేపీ కిసాన్ మోర్చా నేతపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ ఘట్టుప్పల్ పీఎస్ ఎదుట బీజేపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి.
Ghattuppal: బీజేపీ నేతపై దాడి.. పోలీస్ స్టేషన్ ముట్టడించిన కాషాయ శ్రేణులు!
ఘట్టుప్పల: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులు ఘట్టుప్పల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. అంతపేట గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు విరమల్ల రాజుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు.
బీజేపీ నాయకులపై వారం రోజుల క్రితం దాడి జరిగినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదని వారు ఆరోపించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి, బీజేపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు.




