Nalgonda: మునుగోడులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
Nalgonda: మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Nalgonda: మునుగోడులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
నల్లగొండ: 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుగోడు క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు ఈ జెండా పండుగ కార్యక్రమానికి హాజరయ్యారు.
మునుగోడు శాసనసభ్యులు శ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఎగిరేసి జనగణమన గీతాలపన చేశారు.. ఎమ్మెల్యేతో పాటు ప్రతి ఒక్కరు జెండాకు సెల్యూట్ చేసి గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని, స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు... ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలిచి, కన్నీళ్లు తుడిచి వాళ్ళ ముఖంలో సంతోషం చూసినప్పుడే స్వాతంత్ర ఫలితాలు అందరికీ అందినట్లు అని అన్నారు..




