Munugode: నాంపల్లి–మల్లేపల్లి రోడ్డు పనులు అస్తవ్యస్తం.. రెండేళ్లుగా నత్తనడక!

Munugode: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి నుంచి మల్లేపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులు రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Saleem, Nalgonda
Published on: 19 Nov 2026 2:06 PM IST
Munugode
X

Munugode: నాంపల్లి–మల్లేపల్లి రోడ్డు పనులు అస్తవ్యస్తం.. రెండేళ్లుగా నత్తనడక!

మునుగోడు: మునుగోడు నియోజకవర్గం నాంపల్లి నుంచి మల్లేపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులు అస్తవ్యస్తంగా మారాయి. పనులు ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. ఫలితంగా రహదారిపై కంకర తేలి, విపరీతమైన దుమ్ముధూళి లేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, గుత్తేదారు స్పందించి రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda