Munugodu: మునుగోడు మండలం సింగారంలో ఎండిన పొలాల్లో నిరసన బతుకమ్మ వేడుకలు

Munugodu: మునుగోడు మండలం సింగారంలో సాగునీరు అందక ఎండిన పంట పొలాల్లో డిండి సాధన సమితి ఆధ్వర్యంలో మహిళలు నిరసన బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 18 Oct 2026 11:59 PM IST
Munugodu
X

Munugodu: మునుగోడు మండలం సింగారంలో ఎండిన పొలాల్లో నిరసన బతుకమ్మ వేడుకలు

మునుగోడు: మునుగోడు మండలం సింగారం గ్రామంలో ఆదివారం డిండి ఎత్తిపోతల పథకం సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాల్లోనే మహిళలు బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో తమ నిరసనను వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా బ్రాహ్మణవెల్లంల జలాశయం పెండింగ్‌ కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించాలని సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. అలాగే డిండి ఎత్తిపోతల పథకం, శివన్నగూడెం ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి స్థానిక రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో పొలగొని సైదులు, మేకల శ్రీనివాస్‌రెడ్డి, మారగోని అంజయ్య, సునీల్, సురేష్, నవీన్, సాయి, నాగరాజు, మధు, మల్లయ్య, పరమేశ్‌లతో పాటు మహిళలు లింగమ్మ, అంజమ్మ, రాధ, భద్రమ్మ, అండాలు, లక్ష్మమ్మ, పావని, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda