Nalgonda: వరి సాగు చేసి నష్టపోవద్దు - మంత్రుల హెచ్చరిక!
Nalgonda: నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరినందున వరి సాగు చేపట్టి నష్టపోవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు.
Nalgonda: వరి సాగు చేసి నష్టపోవద్దు - మంత్రుల హెచ్చరిక!
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరినందున, వరి సాగు చేపట్టి నష్టపోవద్దని ఆయకట్టు రైతులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
వర్షాలు పడే సూచనలు లేనందున వరికి బదులుగా తక్షణమే ఆరుతడి పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో పరిస్థితులు, ఆరుతడి సాగు, పౌరసరఫరాలపై సచివాలయం నుంచి మంత్రులు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలసి శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Next Story




