Nagarjuna Sagar: ఏడాది తిరిగేసరికి కృష్ణమ్మ వెలవెల సాగర్‌లో నీటికరువు!

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. గతేడాదితో పోలిస్తే వర్షాల్లేక కృష్ణమ్మ వెలవెలబోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Saleem, Nalgonda
Published on: 29 July 2026 12:45 PM IST
Nagarjuna Sagar
X

Nagarjuna Sagar: ఏడాది తిరిగేసరికి కృష్ణమ్మ వెలవెల సాగర్‌లో నీటికరువు!

వెలవెలబోతున్న కృష్ణమ్మ!

గతేడాది ఇదే రోజున ఉప్పొంగిన కృష్ణమ్మ.. నేడు వెలవెలబోతోంది. సరిగ్గా ఏడాది క్రితం సాగర్ ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి సమీపానికి చేరింది.

​ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం కేవలం 513.10 అడుగుల (136.99 టీఎంసీలు) వద్దే నీటి నిల్వలు పడిపోయాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్‌ఎల్‌బీసీ (AMRP) ద్వారా నిమిషానికి 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. వానలు లేక, ప్రాజెక్టులోకి చుక్క నీరు రాక ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల పంట భూములు బీడువారాయి. కనీసం ఈసారైనా కరుణించి వర్షాలు పడకపోతాయా అని ఆయకట్టు రైతాంగం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story