Nalgonda: సాఘర్‌ విజయ విహార్‌లో మహా వరుణ యాగం ఏర్పాట్ల పరిశీలన

Nalgonda: నాగార్జునసాగర్ విజయ విహార్‌లో ఈ నెల 10న మహా వరుణ యాగం. ఏర్పాట్లను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 7 Aug 2026 4:50 PM IST
Nalgonda
X

Nalgonda: సాఘర్‌ విజయ విహార్‌లో మహా వరుణ యాగం ఏర్పాట్ల పరిశీలన

నల్గొండ: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ నెల 10వ తేదీన అత్యంత వైభవంగా వరుణ యాగం నిర్వహించనున్నారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.​సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నేరుగా విజయ విహార్‌లోని యాగస్థలిని క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను అడుగడుగునా పరిశీలించారు.

దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. యాగశాల ఏర్పాటు చేసే ప్రదేశం, యాగం నిర్వహించే ఋత్వికులు, అర్చకులకు ప్రత్యేక వసతి, భోజన సౌకర్యాలు ఒక రోజు ముందే సిద్ధం చేయాలని,సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ సభ్యులు, ఇతర ప్రముఖులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

యాగశాల వద్ద భారీ బారికేడింగ్‌లు, పగోడాలు, ప్రవచనశాల, టెంట్లు, ఎల్ఈడీ (LED) స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలి. ప్రవచనాలు వినేందుకు వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీటింగ్ ఏర్పాట్లు ఉండాలి.

విజయవిహార్ పరిసర ప్రాంతాలు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ కమిషనర్ కోటేశ్వరరావు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, తాత్కాలిక మూత్రశాలలు విస్తృతంగా ఏర్పాటు చేయాలి.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ప్రణాళికను రూపొందించి, యాగ స్థలానికి సంబంధించిన పూర్తి ప్లాన్ (Blueprint) సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story