Nakerekal: కష్టాలను జయించి ఉస్మానియాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సిద్ధిఖ్

Nakerekal: పేదరికాన్ని జయించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన నకిరేకల్ విద్యార్థి అబూబకర్ సిద్ధిఖ్ విజయగాథ.

Saleem, Nalgonda
Published on: 15 Sept 2026 8:01 PM IST
Nakerekal
X

Nakerekal: కష్టాలను జయించి ఉస్మానియాలో ఎంబీబీఎస్ సీటు సాధించిన సిద్ధిఖ్

నకిరేకల్‌: పేదరికం గడప దాటనివ్వకపోయినా, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు నకిరేకల్‌కు చెందిన అబూబకర్ సిద్ధిఖ్.

గతేడాది తండ్రి మౌలానా అక్బర్ హఠాన్మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా ఆ వేదనను దిగమింగుకుని, చదువునే ఆయుధంగా మలచుకున్నాడు.

పక్కా ప్రణాళికతో శ్రమించి NEETలో 552 మార్కులు సాధించి, ప్రతిష్ఠాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నాడు.

కష్టాలను జయించి డాక్టర్ కాబోతున్న సిద్ధిఖ్ విజయం ఎంతోమంది పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda