Nakrekal: ఈసీ తీరుపై నకిరేకల్‌లో కాంగ్రెస్ భగ్గు: దిష్టిబొమ్మ దహనం
Nakrekal: ఓట్ల తొలగింపులో పక్షపాత వైఖరిని నిరసిస్తూ నల్గొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Nakrekal: ఈసీ తీరుపై నకిరేకల్‌లో కాంగ్రెస్ భగ్గు: దిష్టిబొమ్మ దహనం
నల్గొండ: నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఈసీ జ్ఞానేశ్వర్ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్లను తొలగిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈసీ జ్ఞానేశ్వర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




