Nakrekal: నకిరేకల్‌లో కాంగ్రెస్ ‘బూత్ లెవల్ ఏజెంట్ల’ శిక్షణ.. దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే వీరేశం!

Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా కార్యక్రమం. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత, ఏఐసీసీ ట్రైనర్ ఎండీ నుమాన్ హాజరు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 8 Jun 2026 4:16 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో కాంగ్రెస్ ‘బూత్ లెవల్ ఏజెంట్ల’ శిక్షణ.. దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే వీరేశం!

నకిరేకల్, నల్లగొండ జిల్లా: ​నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల కోసం సోమవారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. AICC శిక్షకుడు ఎండీ నుమాన్ ముఖ్య అతిథిగా హాజరై, బూత్ స్థాయి కార్యకర్తలకు ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు నుండి పోలింగ్ రోజు వరకు ఏజెంట్లు పాటించాల్సిన నియమాలను ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, పార్టీ అట్టడుగు స్థాయి నుంచి బలంగా ఉంటేనే గెలుపు సులువవుతుందని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక వంటివారని కొనియాడారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story