Nakrekal: నకిరేకల్ అభివృద్ధికి రూ.21 కోట్లు ఎమ్మెల్యే వీరేశం
Nakrekal: నకిరేకల్‌లో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, 100 పడకల ఆసుపత్రి. వివరాలు వెల్లడించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.
Nakrekal: నకిరేకల్ అభివృద్ధికి రూ.21 కోట్లు ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 18, 19, 20 వార్డుల మహిళలకు ఆయన 'ఇందిరా మహిళా శక్తి' చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా రూ.21 కోట్లతో డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
నకిరేకల్‌కు 800 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలోనే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
Next Story




