Nakrekal: నకిరేకల్‌లో లింగ నిర్ధారణ ముఠా గుట్టురట్టు!
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ శివాజీ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల దందాను పోలీసులు భగ్నం చేశారు.
Nakrekal: నకిరేకల్‌లో లింగ నిర్ధారణ ముఠా గుట్టురట్టు!
Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల దందాను పోలీసులు భగ్నం చేశారు. శివాజీ నగర్‌లోని ఒక ఇంట్లో ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన కొందరు ఆర్ఎంపీల సహకారంతో ఈ ముఠా దందా సాగిస్తోంది. ఆర్ఎంపీల ద్వారా గర్భిణీలను నకిరేకల్‌కు రప్పించి, ఇక్కడి ఓ ఇంట్లో రహస్యంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులిద్దరికీ గతంలోనూ ఇలాంటి నేర చరిత్ర ఉంది. చివ్వెంల మండలంలో జరిగిన ఒక గర్భిణి మరణం కేసులో కూడా వీరిద్దరూ నిందితులుగా ఉండి, జైలుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికీ వారి తీరు మారకపోవడం గమనార్హం.




