Nakrekal: జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని నకిరేకల్లో రాస్తారోకో

Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 6 July 2026 1:13 PM IST
Nakrekal
X

Nakrekal: జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని నకిరేకల్లో రాస్తారోకో

Nakrekal: నల్లగొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్లో టియుడబ్ల్యుజే(ఐజేయు) ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. అనంతరం నకిరేకల్ ఎంఈఓ నాగయ్యకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టు పిల్లలకు పాఠశాల ఫీజు రాయితీ విషయంలో నల్లగొండ జిల్లా డిఇఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి రాయితీ సర్క్యులర్ జారీ చేయాలని నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకు సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు రేపాల సతీష్ జిల్లా నాయకులు కందగట్ల శ్రీధర్ డిమాండ్ చేశారు.

గత సంవత్సరం నల్లగొండ డిఇఓ ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేశారని ఇప్పుడు ఇవ్వడానికి సమస్య ఏమిటని వారు ప్రశ్నించారు. తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా సర్కులర్లు జారీ చేశారని నల్గొండలో మాత్రం జర్నలిస్టులపై నిర్లక్ష్యం వహిస్తూ చిన్నచూపు చూస్తున్నారని వారు తెలిపారు. సర్కులర్ జారీ చేయకపోవడం వెనక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు.

కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ముకాసే విధంగా డీఈవో వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. వెంటనే సర్కులర్ జారీ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు నకిరేకల్ నియోజకవర్గం నాయకులు అలుగుబెల్లి శ్రీనివాసరెడ్డి, రేపాల రంగనాథ్, నకిరేకల్ మండల అధ్యక్షులు బెల్లి సాయి ప్రధాన కార్యదర్శి గడగోజు రవీంద్ర చారి ఉపాధ్యక్షులు మోహన్ నాయకులు మరాటి నరసింహ వాన రాసినారాయణ, గోపి సైదులు, నాగార్జున రెడ్డి, నాగరాజు, చందు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story