Nakrekal: అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలి!
Nakrekal: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం పన్నాలగూడెంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
Nakrekal: అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలి!
నకిరేకల్: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం తన క్యాంప్ కార్యాలయం *పన్నాల గూడెం వద్ద ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమన్వయంతో సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
SIR ప్రక్రియను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర..
SIR ప్రక్రియను అడ్డుపెట్టుకొని ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడి, తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఈ దేశ పౌరుడి ఓటు హక్కును పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత *రాహుల్ గాంధీ * బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో ఒకవైపు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేస్తూనే, మరోవైపు SIR ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఓటు హక్కు మన హక్కు – ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత! అని నినదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




