Nakrekal: ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో చేరిన కృష్ణా జలాలు!
Nakrekal: ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో నకిరేకల్ పెద్ద చెరువులోకి కృష్ణా జలాలు. తాగునీటి ఎద్దడికి పరిష్కారం లభించడంతో ప్రజలు, రైతుల హర్షం.
Nakrekal: ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో చేరిన కృష్ణా జలాలు!
నకిరేకల్: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో నకిరేకల్ పట్టణానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఎల్ నీనో వల్ల పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బంది రాకుండా ఉండాలని, పట్టణ త్రాగునీరు అవసరాలను తీర్చేందుకు, నకిరేకల్ పెద్ద చెరువు, కాలం వారి కుంట, ఎర్ర కుంట లను కృష్ణా జలాలతో నింపనున్నారు.
కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాలకు స్థానిక నాయకులు కొబ్బరికాయ కొట్టి, పూజలు నిర్వహించి ఘన స్వాగతం పలికారు.
ఈ జలాలతో నకిరేకల్ పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి ఎంతో మేలు జరగనుంది. కరువు పరిస్థిల్లో, కృష్ణా జలాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యే గారికి పట్టణ ప్రజలు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




