Nakrekal: టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు వేణుగోపాల్ అభినందన సభ
Nakrekal: నకిరేకల్ లో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు బొజ్జ వేణుగోపాల్ అభినందన సభను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా నిర్వహించారు.
Nakrekal: టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడు వేణుగోపాల్ అభినందన సభ
నకిరేకల్: నకిరేకల్ లో TSUTF ఆధ్వర్యంలో బొజ్జ వేణుగోపాల్ పదవి విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై వేణుగోపాల్ గారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేణుగోపాల్ ఉపాధ్యాయ వృత్తిలో, ఉద్యమంలో చేసిన సేవలు చిరస్మరణీయమని, కొనియాడారు. ఈ కార్యక్రమంలో TSUTF నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




