Nakrekal: చందుపట్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Nakrekal: చందుపట్లలో పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. రైతుల ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందని హామీ.
Nakrekal: చందుపట్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నకిరేకల్: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరావు , మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవ రెడ్డి సర్పంచ్ దిగోజు లత వెంకటాచారి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




