Chityala: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగొద్దు.. ఎమ్మెల్యే
Chityala: నకిరేకల్‌లోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో చిట్యాల మండల ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Chityala: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగొద్దు.. ఎమ్మెల్యే
Chityala: నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హమాలీలు, లారీలు తగినన్ని అందుబాటులో ఉంచి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రైస్ మిల్లర్లతో మాట్లాడి ధాన్యం లిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
Next Story




