Nakrekal: 45 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే అన్నదానం

Nakrekal: నకిరేకల్ అయ్యప్ప ఆలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సొంత నిధులతో 45 రోజుల పాటు స్వాములకు ఉచిత భిక్ష (అన్నప్రసాదం) కార్యక్రమాన్ని ప్రారంభించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 15 Nov 2026 4:14 PM IST
Nakrekal
X

Nakrekal: 45 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే అన్నదానం

నకిరేకల్: నకిరేకల్ పట్టణం అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాముల కోరిక మేరకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన సొంత నిధులతో భిక్ష (అన్న ప్రసాదం)

ఈ సందర్భంగా ఈరోజు నుండి 45 రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు భిక్ష (అన్నప్రసాదం) అందించే కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వాములతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL