Nakrekal: నకిరేకల్‌లో విజిపిపి, విబిజి-రాంజీపై కీలక మండల సమావేశం!

Nakrekal: నకిరేకల్ మండల పరిషత్ కార్యాలయంలో విజిపిపి, విబిజి-రాంజీ పథకాలపై కీలక సమావేశం. అన్ని శాఖల అధికారులు, సర్పంచులు హాజరుకావాలని ప్రత్యేక అధికారి ఆదేశం.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 11 Sept 2026 1:31 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో విజిపిపి, విబిజి-రాంజీపై కీలక మండల సమావేశం!

Nakrekal: నకిరేకల్ మండల ప్రత్యేక అధికారి గారి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో వి జి పీ పి (వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక )మరియు విబిజి -రాంజీ పై మండల సమావేశం నిర్వహించుటకు గాను నిర్ణయించడం అయినది.

ఇట్టి సమావేశమునకు మండలములోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, అన్ని శాఖల మండల అధికారులు సకాలంలో హాజరగుటకు గాను కోరనైనది, అందరూ మండల స్థాయి అధికారులు అనగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎంఈఓ గారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ఎంపీ ఓ గారు, అందరు పంచాయతీ కార్యదర్శులు, వి భి జి రామ్ జి,ఈసీ గారు, అందరు టెక్నికల్ అసిస్టెంట్లు, అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు.

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నుండి పి ర్ ఏఈ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, సెర్ఫ్ నుండి,ఏపీఎం గారు, సీసీలు, వివోఏలు,వెటర్నరీ డాక్టర్ గారు, అగ్రికల్చర్ ఏవో గారు, ఏఈవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, హౌసింగ్ ఏఈ గారు, హార్టికల్చర్ అధికారి గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధికారులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు హాజరు కావలెను.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL