Nalgonda: నకిరేకల్ NH 65పై ఘోర రోడ్డు ప్రమాదం!
Nalgonda: నకిరేకల్ బైపాస్ 65వ జాతీయ రహదారిపై ధాన్యం ట్రాక్టర్‌ను డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
Nalgonda: నకిరేకల్ NH 65పై ఘోర రోడ్డు ప్రమాదం!
Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్ బైపాస్ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. బోల్తా పడ్డ ధాన్యం ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం. నగేష్ హోటల్ సమీపంలో సూర్యాపేట వైపు వెళ్తున్న ధాన్యం ట్రాక్టర్ రోడ్డుపై అడ్డంగా బోల్తా. రోడ్డుపై పడి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టిన డీసీఎం వాహనం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు.. స్థానిక ఆసుపత్రికి తరలింపు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పడిపోవడంతో 65వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్. సుమారు 2 కిలోమీటర్ల మేర స్తంభించిన వాహనాలు. తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.




