Nakrekal: ఉపాధి కూలీలకు అండగా బీఆర్ఎస్.. 600 మందికి మజ్జిగ పంపిణీ!

Nakrekal: నకిరేకల్ మండలం నోముల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, అరటిపండ్లు పంపిణీ.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 26 May 2026 4:02 PM IST
Nakrekal
X

Nakrekal: ఉపాధి కూలీలకు అండగా బీఆర్ఎస్.. 600 మందికి మజ్జిగ పంపిణీ!

నకిరేకల్: మండలం నోముల గ్రామం లో BRS పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ ఉపాధి హామీ ” కూలీలకు మజ్జిగ మరియు అరటిపండ్లు పంపిణీ కార్యక్రమం.కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు ప్రసన్న రాజ్ పాల్గొని కూలీలతో “మాట -ముచ్చట “తో...ఉపాధి హామీ ప్రోగ్రాం. .నిరుపేదల కు వరం లాంటిదని, ఈ ఉపాధి తోనే శ్రామిక పేదలకు కాస్త అన్నం దొరుకుతుందని అట్లాంటి మంచి పథకాన్ని కేంద్రం ఈ మధ్య కాలంలో నీరుగార్చే ప్రయత్నం చేయడం తగదని పేర్కొన్నారు.

అదే విధంగా కూలీలు మండుటెండల్లో పని చేస్తున్నందున వడ దెబ్బ తగలకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కూలీలకు మంచినీరు సరిపడా సప్లయ్ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ ను కోరారు. తదనంతరం దాదాపు 600మంది కూలీలకు మజ్జిగ -అరటిపండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నకిరేకల్ మండల BRS సీనియర్ నాయకులు మరియు గ్రామ BRS వార్డు సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story