Nakrekal: నకిరేకల్‌లో కలకలం: కదులుతున్న ఆటో నుంచి దూకిన మైనర్లు

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఊట్కూర్ వెళ్లాల్సిన ఆటోను వేరే మార్గంలో తీసుకెళ్లడంతో భయాందోళనకు గురైన ఇద్దరు మైనర్ బాలికలు కదులుతున్న ఆటో నుంచి కిందకు దూకారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 10 Oct 2026 11:27 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో కలకలం: కదులుతున్న ఆటో నుంచి దూకిన మైనర్లు

Nakrekal: నకిరేకల్‌లో ఇద్దరు మైనర్ బాలికలకు ఎదురైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి బస్సులో ప్రయాణిస్తూ దిగాల్సిన చోట కాకుండా ముందుకు దిగిన ఇద్దరు బాలికలు.

ఊట్కూర్ గ్రామానికి వెళ్లేందుకు ప్రత్యేక ఆటోను ఆశ్రయించారు. అయితే, వారిని ఊట్కూర్ గ్రామానికి తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవర్ ఇనుపాముల వైపు తీసుకెళ్లడంతో బాలికలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు సమాచారం. దీనికి తోడు, ఆటో డ్రైవర్ ఫోన్‌లో ఎవరికో కాల్ చేయడంతో మరింత భయపడిన బాలికలు.

ప్రాణభయంతో కదులుతున్న ఆటో నుంచి కిందికి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన బాలికలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం బాధిత బాలికలు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు అని తెలుస్తుంది..

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL