Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Nakrekal: నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 8 Nov 2026 4:39 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నకిరేకల్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నకిరేకల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో. ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL