Nakrekal: నకిరేకల్ ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేధింపులు

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ మహిళా అటెండర్ నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 8 Oct 2026 2:54 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్ ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేధింపులు

Nakrekal: నకిరేకల్ ఐసీడీఎస్ కార్యాలయంలో కలకలం రేగింది. ఆ కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి నాగలక్ష్మి తనను సీనియర్ అసిస్టెంట్ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు

నకిరేకల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఈ కార్యాలయంలో మహిళా అటెండర్ గా నాగలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు.

తన విధులకు ఆటంకం కలిగిస్తూ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న Ch. శ్రీనివాస్ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

కార్యాలయ ఆవరణలోనే ఆమె తన ఆవేదనను వెల్లగక్కిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. తనకు జరుగుతున్న వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

ఈ ఆరోపణలపై ఐసీడీఎస్ ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారుల వివరణ తీసుకోవాల్సి ఉంది.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL