Nalgonda: నల్గొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు.. 15న లక్ష మందితో బహిరంగ సభ

Nalgonda: నల్గొండలో ఈనెల 15 నుంచి 18 వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు. 15న లక్ష మందితో బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఎం నేత ఏజే రమేష్ పిలుపు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Nov 2026 5:54 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు.. 15న లక్ష మందితో బహిరంగ సభ

నల్గొండ: ఈనెల 15 నుండి 18 వరకు నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్ సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన పార్టీ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాపిత రైతాంగ ఉద్యమాలకు నాలుగు రోజులపాటు నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు.

ఈనెల 15వ తేదీన లక్షమంది రైతులతో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పదివేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లతో కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభకు రైతాంగాన్ని కదిలించడానికి,మహాసభల జయప్రదానికై ప్రచారం,గ్రూప్ మీటింగ్ ల ద్వారా రైతాంగాన్ని కదిలించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే కుట్రలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని,ప్రజలను కదిలించి భవిష్య పోరాటాలు నిర్వహించి భూమి నుండి రైతును వేరు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఎలినీనో ప్రభావం వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

దొడ్డి దారిన అమలు చేయాలని చూస్తున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తిప్పికొట్టడానికి రైతాంగాన్ని పోరాటాలకు సిద్ధం చేసేందుకు జాతీయ మహాసభలలో ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు.రైతాంగ ఉద్యమాల బలోపేతానికి,రైతు రక్షణ కొరకు జరుగుతున్న జాతీయ మహాసభల జయప్రదానికి రైతులకు మద్దతుగా రైతు క్షేమాన్ని కోరుకునే ఇతర ప్రజానికం కూడా నల్గొండకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ నాయకులు ఎస్ లక్ష్మి విజయగిరి శ్రీనివాస్ ఆలేటి శ్రీను జయశ్రీ నాగకృష్ణ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM