Nalgonda: ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులకు రూ.26 వేల వేతనం చెల్లించాలి

Nalgonda: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాంట్రాక్టు కార్మికులకు కొత్త టెండర్లు పిలిచి రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ నేత పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 12 Nov 2026 4:18 PM IST
Nalgonda
X

Nalgonda: ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులకు రూ.26 వేల వేతనం చెల్లించాలి

నల్గొండ: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాంట్రాక్టు కార్మికులకు వెంటనే కొత్త టెండర్లు పిలిచి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

గురువారం నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపి ఆర్ఎంవోకు వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా పాత టెండర్లతోనే నెట్టుకొస్తూ వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. సకాలంలో పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda