Nalgonda: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు నల్లగొండ క్రీడాకారులు
Nalgonda: హైదరాబాద్‌లో జరిగే 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు నల్లగొండ జిల్లాకు చెందిన థాంగ్-టా క్రీడాకారులు కె.సూర్య వర్ధన్‌రెడ్డి, పి.చందన ఎంపికయ్యారు.
Nalgonda: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు నల్లగొండ క్రీడాకారులు
నల్లగొండ జిల్లా: హైదరాబాద్ వేదికగా డిసెంబరు మొదటి వారంలో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. థాంగ్-టా క్రీడాంశంలో జిల్లాకు చెందిన కె.సూర్య వర్ధన్‌రెడ్డి (బాలురు), పి.చందన (బాలికలు) అండర్-60 కేజీల విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా థాంగ్-టా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మునుకుంట్ల రాజేష్‌రెడ్డి, అంబటి ప్రణీత్ తెలిపారు.
జాతీయ స్థాయిలో నల్లగొండ ఆటగాళ్లకు అవకాశం కల్పించిన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు తాడెం రవి, ప్రధాన కార్యదర్శి రాజులకు వారు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాతో పాటు రాష్ట్రానికి పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కందుల సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




