Nalgonda: సీఎం స్పందించి విద్యార్థుల గందరగోళాన్ని తొలగించాలి పోగుల సైదులు గౌడ్

Nalgonda: ప్రైవేటు జూనియర్ కళాశాలల అఫిలియేషన్ గుర్తింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 27 Jun 2026 5:07 PM IST
Nalgonda
X

Nalgonda: సీఎం స్పందించి విద్యార్థుల గందరగోళాన్ని తొలగించాలి పోగుల సైదులు గౌడ్

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలై 15 రోజులు గడిచిపోతున్న ప్రైవేటు జూనియర్ కళాశాలకు గుర్తింపు రాకపోవడంతో అయోమయంలో విద్యార్థులు ఉన్నారని ఇంటర్మీడియట్ బోర్డు వెంటనే ప్రైవేట్ కళాశాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ డిమాండ్ చేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కళాశాలల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు పూర్తి పూర్తి చేయకుండా జాప్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఇంటర్మీడియట్ ప్రైవేట్ కళాశాలల (అఫిలియేషన్) గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

విద్యా హక్కు చట్టం కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డ్ పై ఉందని గుర్తు చేశారు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ కళాశాల (అఫిలియోషన్) గుర్తింపు జాప్యం వల్ల విద్యార్థులు అయోమయం పడాల్సినపరిస్థితి తీసుకురావడాన్నీ తప్పు పట్టారు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నందున తక్షణ చర్యలు చేపట్టి విద్యార్థులను గందరగోళం నుంచి తప్పించాలని కోరారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story