Nalgonda: రోడ్లు వేస్తావా… రాజీనామా చేస్తావా? నాగం వర్షిత్ రెడ్డి
Nalgonda: నల్గొండ మాడుగులపల్లి-చెరుగుపల్లి రోడ్డు దుస్థితిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆగ్రహం. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్.
Nalgonda: రోడ్లు వేస్తావా… రాజీనామా చేస్తావా? నాగం వర్షిత్ రెడ్డి
నల్గొండ: నల్గొండ అసెంబ్లీ పరిధిలోని మాడుగులపల్లి నుంచి దాచారం, చెరుగుపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారి, వర్షం పడితే మడుగులను తలపిస్తోందని,ఈ రోడ్డుపై ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… “రోడ్లు వేస్తావా… రాజీనామా చేస్తావా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ప్రజలు, రైతులు, గ్రామస్తులు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇటికాల జానారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి, భూపాల్ రెడ్డి, రాజీవ్ రెడ్డి, మోహన్ రెడ్డి, నరసింహ, సతీష్ యాదవ్, కడియం సైదులు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




