Nalgonda: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: మాదగాని శ్రీనివాస్ గౌడ్

Nalgonda: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని నల్లగొండలో బీజేపీ నేత మాదగాని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 13 Sept 2026 7:12 PM IST
Nalgonda
X

Nalgonda: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: మాదగాని శ్రీనివాస్ గౌడ్

నల్లగొండ జిల్లా: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.1947 ఆగస్టు 15వ తేదీన దేశమంతా స్వాతంత్రం వచ్చినప్పటికీ, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం సిద్ధించిందన్నారు.

తెలంగాణ చరిత్ర భావితరాలకు తెలవాలంటే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తూ , ఎంఐఎం కి భయపడుతుందని ఆరోపించారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతోపాటు, చరిత్రను పాఠ్యాంశంలో చేర్చడం జరుగుతుందన్నారు.

విలేకరుల సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతేపాక లింగస్వామి, ఫకీరు మోహన్ రెడ్డి, పాలకూరి రవి గౌడ్, యానాల కరుణాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి బిక్షం తదితరులు ఉన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET