Nalgonda: నల్గొండలో బీజేవైఎం రక్తదాన శిబిరం: మోదీ బర్త్‌డే వేడుకలు
Nalgonda: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నల్గొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
Nalgonda: నల్గొండలో బీజేవైఎం రక్తదాన శిబిరం: మోదీ బర్త్‌డే వేడుకలు
నల్గొండ జిల్లా: బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా చేపట్టిన 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా నల్గొండలో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఈ సేవ సంకల్ప అభియాన్ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 17 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మోడీ 25 ఏళ్ల ప్రజాసేవకు మద్దతుగా సేవా భావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్, సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ నూకల నారాయణరెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ పోతపాక లింగస్వామి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేష్ హాజరయ్యారు.
వారితో పాటు పిండి పాపిరెడ్డి, పోశెట్టి భద్రమ్మ, కిషన్, కనకయ్య, దాసరి వెంకన్న, ఏడుకొండలు, శ్రీధర్, దేవేందర్లతో పాటు బీజేవైఎం నాయకులు సైదులు, సాయి, అజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




