Nalgonda: సీఎం నల్గొండ పర్యటన: తిప్పర్తిలో బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్!

Nalgonda: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిప్పర్తి మండలంలో బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Saleem, Nalgonda
Updated on: 29 Jun 2026 12:49 PM IST
Nalgonda
X

Nalgonda: సీఎం నల్గొండ పర్యటన: తిప్పర్తిలో బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్!

తిప్పర్తి: నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిప్పర్తి మండలంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని తిప్పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

​అరెస్టయిన వారిలో మామిడాల సర్పంచ్ కొత్తపల్లి సైదులు, కాశివారిగూడెం సర్పంచ్ షేక్ కమాల్, పార్టీ ముఖ్య నాయకులు రవీంద్ర రెడ్డి, కందుల లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story