Nalgonda: బీఆర్‌ఎస్‌వీ నేత ముందస్తు అరెస్ట్ సీఎం పర్యటన తీవ్ర నిరసన!
Nalgonda: నల్లగొండలో సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్‌వీ నేత నవీన్ ముందస్తు అరెస్ట్. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Nalgonda: బీఆర్‌ఎస్‌వీ నేత ముందస్తు అరెస్ట్ సీఎం పర్యటన తీవ్ర నిరసన!
ముందస్తు అరెస్టులతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరు: బీఆర్‌ఎస్‌వీ నాయకుడు నవీన్ ఆగ్రహం
నల్గొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్‌ను నార్కెట్‌పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం మానేసి, ముందస్తు అరెస్టులకు పాల్పడటం దారుణమని మండిపడ్డారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Next Story




