Nalgonda: చందంపేటలో ఉద్రిక్తత.. బీజేపీ మండల అధ్యక్షుడుపై దాడికి నిరసన
Nalgonda: నల్లగొండ జిల్లా చందంపేట మండల బీజేపీ అధ్యక్షుడు వినోదాచారిపై కాంగ్రెస్ రామకృష్ణారెడ్డి దాడి చేసిన ఘటనపై నిరసనగా దేవరకొండ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా.
Nalgonda: చందంపేటలో ఉద్రిక్తత.. బీజేపీ మండల అధ్యక్షుడుపై దాడికి నిరసన
Nalgonda: నల్లగొండ జిల్లా చందంపేట మండల బీజేపీ అధ్యక్షుడు వినోదాచారిపై కాంగ్రెస్ నాయకుడు, గాగిలాపూర్ మాజీ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి జరిగి రోజులు గడుస్తున్నా, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, దేవరకొండ బీజేపీ ఆధ్వర్యంలో చందంపేట మండలం పోలేపల్లి వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు హాజరై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "హిందువులపై, ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మరియు బీజేపీ మండల అధ్యక్షుడిపై దాడి చేసిన రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి" అని డిమాండ్ చేశారు.
ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాదని, హిందూ సమాజంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు.పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో హిందువులంతా ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, స్థానిక ఎమ్మెల్యేల ఇళ్లతో పాటు ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ ధర్నాతో పోలేపల్లి ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




