Nalgonda: నల్గొండలో రేపు 'చేయూత' పింఛన్ల పంపిణీ: కలెక్టర్ చంద్రశేఖర్!

Nalgonda: నల్గొండ నియోజకవర్గ స్థాయి చేయూత పింఛన్ల పంపిణీ శుక్రవారం ఏచూరి గార్డెన్‌లో జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి హాజరుకానుండగా, కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఏర్పాట్లను పరిశీలించారు.

Saleem, Nalgonda
Published on: 12 Nov 2026 2:55 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో రేపు 'చేయూత' పింఛన్ల పంపిణీ: కలెక్టర్ చంద్రశేఖర్!

నల్గొండ: నల్గొండ నియోజకవర్గ స్థాయి ‘చేయూత’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం (ఈ నెల 13న) పట్టణంలోని ఏచూరి గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. గురువారం ఆయన అధికారులతో కలిసి ఏచూరి గార్డెన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.

లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, భోజనం, హెల్ప్ డెస్క్, మండలాలు, డివిజన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనర్హులకు పింఛన్లు అందకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda